కొరోనా నేర్పిన పాఠాలు
కొరోనా - కోవిడ్ -19 : ఒక ప్రళయం
కొరోనా ఒక కంటికి కనిపించని శత్రువు. ఎక్కడ పుట్టిందో ? ఎక్కడ పెరిగిందో? ఎన్నెన్ని దేశాలు తిరిగిందో? ప్రపంచం మొత్తం మీద ఎంతమందికి సోకిందో? ఎంతమందిని చంపిందో? ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. కొన్ని కోట్లమంది జీవితాలను తలక్రిందులు చేసింది. మనుషులను మానవత్వం మరిచేట్టు చేసింది.
కొరోనాకు ముందు జీవితం
ఒక పెళ్లి చెయ్యాలి అంటే షుమారు 500 నుంచి 1000 మంది వరకు అతిధులను పిలిచేవారు. ఒకరితో ఒకరు పోటీపడి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు. పేదవాడి నుండి కోటీశ్వరుడు వరకు ఎవరికి తగినట్లు వారు ఆడంబరంగా చేసేవారు.
పుట్టినరోజు , పెళ్లిరోజు, ఎంగేజ్మెంట్, బారసాల, వడిబియ్యం, ఖర్మఖండాలు ఇలా ప్రతి సంధర్భంలో ఆప్పుచేసైనా ఖర్చు చేసేవారు, ఆడంబరం, హోదా కోసం.
పండగొచ్చిందంటే వేలకువేలు ఖర్చు పెట్టేవారు. వారాంతంలో బోరుకోంట్టిందంటే స్నేహితులతో పార్టీలు, బయట తిరుగుళ్ళు, యాత్రలు, సినిమాలు, షికార్లు, హోటల్ భోజనాలు. ఏదైన తినాలి అనిపిస్తే మొబైల్ ఫోన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మొబైల్ ఫోన్లో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో కారు ఇంటివద్దకే వస్తుంది. పండగ సెలవలు వస్తే విహార యాత్రలు. వేసవి సెలవల్లో విదేశీ యాత్రలు ఇలా డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేవారు.
30 వేలు జీతం వస్తే అవుసరం వున్నా లేకున్నా హోదా కోసం లోన్ లో కారు కొనడం. 50 వేలు జీతం వస్తే లోన్ లో ఫ్లాట్ కొనడం. ఇంట్లో సామాన్లు కూడా అంతేనండోయ్. డబ్బును ఇలా ఖర్చు చేయడం. రేపటిగురించి ఆలోచనలేదు. భవిష్యత్తు గురించి భయం లేదు.
2020 సంవత్సరం రానే వచ్చింది. కొత్త సంవత్సర సంబరాలు మరువక ముందే సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి పిండివంటలు అయిపోకముందే ఒక పిడుగులాంటి వార్త " చైనా లో కొరోనా అని కొత్త జబ్బు " వచ్చిందని. ఫిబ్రవరిలో మనదేశం లోకి అడుగు పెట్టింది. ఏయే దేశానికి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు, ఎందుకంటే కొరోనాకి పాసుపోర్టు, వీసా, విమానం టిక్కెట్ అవుసరం లేదు. రెండు నెలల్లో ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించింది. ప్రపంచం మొత్తం స్తంభించింది.
ఒక ఊరు లాక్ డౌన్ కావాలి అంటే ఎంతో కష్టం, అటువంటిది ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అంటే ఊహించగలరా, కానీ అదే జరిగింది. ఒక వ్యక్తి తన 80 -90 సంవత్సరాల జీవిత కాలంలో చూడని పరిస్థితి. మరిచిపోలేని అనుభవం.
కొరోనా ప్రభావం
ప్రపంచం మొత్తం స్తంభించింది. బస్సులు, రైళ్ళు, విమానాలు, ఓడలు అన్ని బందు. స్కూళ్ళు, కాలేజులు బందు. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, షాపులు, హోటళ్లు, ప్రార్ధనా మందిరాలు బందు. వైన్ షాపులు బందు.
రోజువారీ కూలీలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ప్రైవేట్ ఉద్యోగులు, రవాణా సంస్థలు, పర్యాటక రంగం, కులవృత్తులు అన్ని రకాల ప్రజల జీవితాలు తలక్రిందులై పోయాయి. వీరు కోలుకోవడానికి ఎంత కాలం పండుతుందో తెలియదు.
ఇప్పటివరకు మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, అవుసరం వున్నా లేకున్నా డబ్బు ఖర్చుపెట్టాము. విందులు, విలాసాలు. రేపటిగురించి బెంగలేదు. జీవితం సాఫీగా సాగిపోయింది.
కొరోనా నేర్పిన పాఠాలు
రెండునెలలు సంపాదన ఆగిపోతేనే తట్టుకోలేకపోయాం. ఎంతోమంది జీవితాలు తలక్రిందులై పోయాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
దీనికంతటికి కారణం ఏమిటి ?
రేపటిగురించి ఆలోచన లేకపోవడం. పొదుపు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. సంపాదించిందంతా ఖర్చుపెట్టడం మాత్రమే జరిగింది.
ఇప్పుడు చాలామందికి "పొదుపు" జీవితంలో ఎంత అవుసరమో, ఎంత ముఖ్యమో తెలిసివచ్చింది.
పొదుపు ఎలా చేయాలి? డబ్బుని ఎలా కూడపెట్టాలి? దానిద్వారా సంపద ఎలా వృద్ధి చేయాలి? దీనికి ఎన్నో మార్గాలు వున్నాయి. కానీ ఏ పొదుపు మార్గం ద్వారా ఎక్కువ సంపద తయారు చేయవచ్చు ?


వివరంగా తదుపరి భాగంలో తెలుసుకొందాం.
మీ
పల్లెర్ల శ్రీనివాస రెడ్డి
ఫోన్: 99518 66000
63033 71683










Very good analysis of the current situation..Really awesome
ReplyDeleteNice start Sreenu
ReplyDeleteSimply superb 👍👍go ahead
ReplyDeleteGood start sreenu ... the blogger
ReplyDeleteఅవును karona మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. Super sir.
ReplyDeleteNice,keep it up Srinivas garu.
ReplyDeleteExcellent... Gaa vundhi... I am waiting for next blog.
ReplyDeleteVery good writeup on what everyone has gone through and lessons to be learned. There is scope for learning more lessons. Hanimi Reddy
ReplyDeleteExcellent sir
ReplyDeleteSimply super
Super sir, all the best for your next blogs
ReplyDelete